సినీ నటుడు సుమన్ కుప్రౌడ్ ఆఫ్ ఇండియా అవార్డు బహూకరణ
జర్నలిస్టుల సత్కారం జీవితంలో మరపురానిది
మీడియా అవార్డుల, ఉపకారవేతనాల గోడపత్రిక ఆవిష్కరణ
డాబాగార్డెన్స్.. అక్టోబర్ 17
ప్రముఖ సినీ నటుడు, మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన సుమన్ సేవలను గుర్తించి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గము ప్రౌడ్ ఆఫ్ ఇండియా అవార్డును ప్రధానం చేసింది. ఆదివారం ఇక్కడ డాబాగార్డెన్స్ విజేఎఫ్ప్రె స్ క్లబ్ లో సుమన్ ను ఘనంగా సత్కరించి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ జర్నలిస్టులు చేసిన ఈ జాతీయ సత్కారం తన జీవితంలో మరపురానిది అన్నారు.
ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందినప్పటికీ విశాఖ జర్నలిస్టులు తన సామాజిక సేవలను గుర్తించి ప్రౌడ్ అఫ్ ఇండియా అవార్డు అందజేయడం గర్వంగా ఉందన్నారు. తాను జీవితాంతం విశాఖ జర్నలిస్ట్ లును గుర్తు పెట్టుకునే విధము గా ఈ అవార్డ్ నిలిచి పోతుందన్నారు..సినీ నటుడిగా అనుకోకుండా రంగప్రవేశం చేశానని,తొలుత కరాటే క్రీడాకారుడిగా మాత్రమే అందరికీ పరిచయం అన్నారు. తమిళ సినీ దర్శకులు తనలోని ప్రతిభాపాటవాలను గుర్తించి తనకు అనేక సినిమాల్లో అవకాశం కల్పించారన్నారు.. తమిళ మీడియా కూడా తనకు ఎంత గానో ప్రోత్సాహం . అందించింది అన్నారు... ఆ తర్వాత అన్ని భాషలలోనూ అవకాశాలు లభించాయన్నారు. తాను రాముడు, కృష్ణుడు సత్యనారాయణ స్వామి ఇలా ఏ రూపము లో నటించిన అంతా భగవంతుని కృపగా భావిస్తున్నట్లు చెప్పారు..విశాఖలో మార్షల్ ఆర్ట్స్ క్రీడల నిర్వహణకు ఇక్కడ పలువురు ముందుకు రావడం ఎంతో అభినందనీయం అన్నారు. అందువల్ల కరాటే పోటీల్లో జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్ లు నిర్వహించగలిగామన్నారు. కోవిడ్ సమయంలో జర్నలిస్టు లు అందించిన సేవలు మరపురాని వన్నారు. ఏ ప్రాంతం లో షూటింగ్ ఉన్న విశాఖ నుంచి ఆహ్వానం అందగానే ఇక్కడకు రావాలని భావిస్తానన్నారు.. విశాఖ కి ఆ సత్తా వుందన్నారు..జర్నలిస్టుల సంక్షేమానికి ఎవరు ఏం చేసినా అది చాలా తక్కువ అన్నారు.. కోవిడ్ సమయము లో జర్నలిస్ట్ లు అందించిన సేవలు అత్యంత ప్రశంసలు పొందాయన్నారు. అతిథిగా హాజరైన వీఎంఆర్డీఏ చైర్మన్ అక్కరమాని విజయ నిర్మల మాట్లాడుతూ సినీ రంగంలో ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించిన సుమన్ ను తన చేతుల మీదుగా సత్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం సినీ కళాకారులు కు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కంచర్ల సినిమా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ తమ ఉపకార్ సంస్ధ ద్వారా యెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.. తన సినిమా త్వరలోనే పూర్తి చేస్తున్నామన్నారు. తన ఎదుగుదలకు అందరి సహకారం ఎంతో అవసరం అన్నారు.సభకు అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విభిన్న రంగాల్లో పలువురు ప్రతిభాపాటవాలను గుర్తించి అటువంటి వారిని సత్కరించుకోవడం సంతోషంగా భావిస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ పాలక వర్గం పూర్తి స్థాయిలో పని చేస్తుందన్నారు. ఈ నెల 30న మీడియా అవార్డులు ప్రధానం, ఉపకార వేతనాల పంపిణీ వంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యదర్శి దాడి రవి కుమార్ , మీడియా అవార్డ్ లు కమిటీ చైర్మన్ ఆర్ నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ ప్రతిభావంతులైన జర్నలిస్టులు ను ప్రతియేటా సత్కరించడం జరుగుతుందన్నారు.. ఆంధ్ర యూనివర్సిటీ వై వి ఎస్ మూర్తి ఆడిటోరియంలో 30 న ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.. సినీ నటుడు సుమన్ ను తమ ఫోరమ్ ద్వారా సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మీడియా అవార్డుల, ఉపకార వేతనాల గోడ పత్రికను సుమన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరం కార్యవర్గ సభ్యులు ఎం ఎస్ ఆర్ ప్రసాద్, ఇరోతీ ఈశ్వరరావు , పి. దివాకర్, సనపల మాధవ్ రావు,గయాజ్, దొంగ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు

