వేములవలస ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం

వేములవలస ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం

ఆనందపురం :వి న్యూస్ ప్రతినిధి

 మండలంలోని వేములవలస ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన తండ్రి భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ నాగభూషణరావు ఆర్థిక సహాయంతో పదివేల రూపాయలు విలువచేసే విద్యా క్రీడా వస్తువులను బాలబాలికలకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ భారతమాతకు మరో రూపం బాలికలేనన్నారు. 

ప్రతి బాలిక భవిష్యత్ శక్తిగా అభివర్ణించారు. బాలికలు లేకుంటే భవిష్యత్ అంధకారంగా మారుతుంది అన్నారు. వారికి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చి సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇప్పటికే పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో  రాణిస్తున్నారని అన్నారు. చిన్నతనంలోనే వీరిని ప్రోత్సహిస్తే వారి పట్టుదలతో  ఎన్నో అద్భుతాలు సృష్టించగలర ని నవీన్ జ్ఞానేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన బాలికల చేత కేక్ కట్ చేయించి విద్య క్రీడా సామగ్రిని అందజేసి వారితో పాటు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయురాలు కే. స్వర్ణలత, సుభాషిణి, ముడసల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.