మంగళవారం నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. దీపావళి ముందు కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఆర్‌బీఐ!

మంగళవారం నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. దీపావళి ముందు కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఆర్‌బీఐ!

పుణే:

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది. ఈసారి ఆర్‌బీఐ పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సేవా వికాస్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసేసింది.

ఆర్‌బీఐ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 10న ఈ మేరకు ప్రకనట విడుదల చేసింది. బ్యాంక్ వల్ల సరిపడినంత మూలధనం లేదని ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే బ్యాంక్ వద్ద సరైన రాబడి అంచనాలు కూడా లేవని తెలిపింది. అందుకే బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

సేవా వికాస్ కోఆపరేటివ్ బ్యాంక్ బ్యాంకింగ్ సేవలు అక్టోబర్ 10 నుంచి బంద్ అవుతాయని ఆర్‌బీఐ తెలిపింది. అంటే నిన్నతోనే బ్యాంక్ క్లోజ్ అయిపోయింది. కస్టమర్లు ఇకపై ఈరోజు నుంచి ఎలాంటి బ్యాంకింగ్ సేవలు పొందలేరు. దీని వల్ల బ్యాంక్ ఖాతాదారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 11(1), సెక్షన్ 22(3) (డీ), సెక్షన్ 56 ప్రకారం ఈ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నామని ఆర్‌బీఐ తెలిపింది.