వైసీపీ అనుకూల ప్రచారం ఆపాలని సీఐటీయూ మధురవాడ జోన్ కమిటీ జి వి ఎం సి జోన్ 2 కార్యాలయం సుపర్నెంట్ జి అప్పలరాజుకి వినతి
మధురవాడ:
ఎం ఎల్ సి ఓట్లు నమోదు లో సచివాలయం,వలెంటర్ల పాల్గోవడం ,వైసీపీ అనుకూల ప్రచారం ఆపాలని సీఐటీయూ మధురవాడ జోన్ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి అప్పలరాజు, పి రాజు కుమార్ జి వి ఎం సి జోన్ 2 కార్యాలయం సుపర్నెంట్ జి అప్పలరాజుకి వినతి పత్రం సమర్పించారు.ఈ వినతిపత్రం లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలను అనుసరించ కుండా జి వి ఎం సి జోన్ 2 పరిధిలో మధురవాడ లో అన్ని ప్రాంతాలలో సచివాలయం కార్యదర్శులు,వార్డు వాలెంటర్లు
ఓట్లు నమోదు చేస్తున్నారని తెలియజేశారు.దీంతో పాటు అధికార పార్టీ వై ఎస్ ఆర్ సి పీ అనుకూల ప్రచారం చేస్తున్నారని తెలియ జేశారు. ఎం ఎల్ సి ఓటర్ల నమోదు నిబంధనలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టమైన ఆదేశాలు అమలు చేయకుండా, ఇష్టానుసారం అధికార పార్టీకి వలెంటర్లుగా పని చేస్తున్నారని తెలియ జేశారు.వెంటనే చర్యలు చేపట్టి సక్రమమైన పద్ధతిలో ఎం ఎల్ సి ఓటర్ నమోదు జరిగేటట్లు చెయ్యాలని.లేకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలియ జేశారు.దీనంతటికీ మండల,జోన్ ఎన్నికల అధికారులదే భాధ్యత అని అన్నారు.