కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో బి.వి.రామ్ భేటీ

 * కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో బి.వి.రామ్ భేటీ


* 22న రామకృష్ణ బీచ్ తీరంలో  " సింహ గర్జన " సభకు ఆహ్వానం


* మూడు రాజధానులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మానస పుత్రికలని వ్యాఖ్య


* ముఖ్యమంత్రి కూడా బహిరంగ సభకు హాజరవుతారు 


      ---- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ 


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఢిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈనెల 22వ తేదీన విశాఖ రామకృష్ణ బీచ్ లో నిర్వహించే " సింహ గర్జన " బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఈ నాయకులు ఇద్దరినీ కూడా సింహ గర్జన సభకు రావాలని ఆహ్వానించారు. అదే విధంగా  రామ్ తన మిత్ర బృందంతో కలిసి ఇండియా గేట్ ఆవరణలోనూ సింహ గర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహ గర్జన బహిరంగ సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో పాటు ఇతర పార్టీలలో రాజకీయ నాయకులు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. అయితే సభ నిర్వహణకు  ఆటంకాలు ఎదురవుతున్నాయని ప్రస్తావించారు.

ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి  జోక్యం చేసుకొని సభ నిర్వహణకు అనుమతి ఇప్పించాల్సిందిగా కోరారు. మూడు రాజధానుల పై  ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుసుకొనే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా  సభకు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే మూడు రాజధానులు అనేవి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మానస పుత్రికలని  అభివర్ణించారు. ఇదిలా ఉండగా ఈనెల 15వ తేదీన  మంత్రి అమర్ నేతృత్వంలో నిర్వహించిన గర్జన సభ ఫ్లాప్ అయిందని.. ఏది ఏమైనా  తాము నిర్వహించే సింహ గర్జన సభ విజయవంతం అవుతుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.