టిడిపి పట్టభద్రుల ఎమ్మెల్సి గెలుపే నాంది కావాలి..!*టిడిపి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ భరత్
విశాఖ వి న్యూస్ ప్రతినిధి:
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, మరలా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని వేయి కళ్ళతో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇది ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సి గెలుపుతో నాంది కావాలని తెలుగుదేశం పార్టీ నేత, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ భరత్ అన్నారు.
బుధవారం శృంగవరపుకోట నియోజకవర్గం లకవరపుకోటలో నియోజకవర్గం ఇంచార్జ్ కోళ్ల లలితకుమారి అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా శ్రీ భరత్, ఎమ్మెల్సి అభ్యర్థిని గాడు చిన్ని కుమారి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండే ప్రతీ పౌరుడు అబద్రతా భావంతో జీవిస్తున్నారని, దీనికి కారణం వైసిపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరే కారణమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికలు జరుగుతున్నాయని, అందరూ కాస్త సహనంతో పనిచేసి మన అభ్యర్థిని గాడు చిన్ని కుమారి లక్ష్మి గెలువు కోసం కృషి చేయాలని కోరారు. ప్రతీ విద్యా వంతుడు అధికార వైసిపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, అందువలన ఈ గెలుపు మనకు నాంది కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పట్టభద్రులకు శ్రీ భరత్ విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోళ్ల రాంప్రసాద్ తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

