జర్నలిస్టు పరశురామ్ పై హత్యాయత్నం ఘటన హోంమంత్రి దృష్టికి

జర్నలిస్టు పరశురామ్ పై హత్యాయత్నం ఘటన హోంమంత్రి దృష్టికి 

ఆంధ్రప్రదేశ్:

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్రకార్యదర్శి నేషనల్ న్యూస్ ఎక్స్ ప్రెస్ (విశాఖపట్నం ) సంపాదకుడు కె.పరుశురాంపై దాడిని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. 

ఈ సంఘటనను రాష్ట్ర అధ్యక్షులు సాంబశివ నాయుడు. రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మేడందృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

పరశురాంపై స్థానికంగా నేర చరిత్ర కలిగి ఉన్న పచ్చిగళ్ళ కృష్ణ,సురేష్ రౌడీషీటర్ రాజు లు 

మరో వ్యక్తితో కలిసి తీవ్రంగా దాడి చేశారు.

వీరిపై గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు.

నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.

అలాగే ఇలాంటి సంఘటనలు పునరాగం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా సాంబశివ నాయుడు హోం మంత్రి కోరారు.

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడుతో పాటు ప్రధాన కార్యదర్శి గురు కాంతా చారి,కార్య నిర్వాహక కార్యదర్శి సాయికుమార్ 

కార్యదర్శి అడుసుమిల్లి రాధాకృష్ణ,అమరావతి అధ్యక్షులు హుమాయున్ 

కోశాధికారి డి కోటేశ్వరావు ఎగ్జిక్యూటివ్ నెంబర్ కలీల్ రహమాన్ తదితరులు పరశురాం పై దాడిని ఖండించారు.