వైయస్సార్ కాలనీ కుటుంబాలకు ఎట్టకేలకు త్రాగునీటి సమస్య పరిష్కారం

 వైయస్సార్ కాలనీ కుటుంబాలకు ఎట్టకేలకు త్రాగునీటి సమస్య పరిష్కారం

భీమిలి వి న్యూస్ ప్రతినిధి:

ఆనందపురం మండలంలోని వేములవలస పంచాయతీ వైయస్సార్ కాలనీ కుటుంబాలకు ఎట్టకేలకు త్రాగునీటి సమస్య పరిష్కారం అయ్యింది. వాటర్ ట్యాంక్ నుండి కుళాయిలకు నీరు రాక గత వారం రోజులుగా నరకయాతన పడ్డారు. ఈ విషయాన్ని స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన స్పందించి పాత మోటర్ ను మార్చి కొత్త మోటార్ ను అనుసంధానం చేయించారు. దీంతో కాలనీవాసులు కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.అలాగే అతని వెంట ఉన్న ఎలక్ట్రీషియన్ ఎర్రాజి స్వామి నాయుడు ను కూడా అభినందించారు.