అయ్యప్ప స్వామి సేవ పీఠం ఆధ్వర్యంలో నిత్య అన్నదానం...
భీమిలి వి న్యూస్ ప్రతినిధి
భీమిలి మండలం కృష్ణంరాజుపేట (డొకరపేట) గ్రామం రామాలయంలో కార్తీక మాసం అయ్యప్పస్వామి భక్తుల కోసం శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి సేవ పీఠం ఆధ్వర్యంలో జిల్లా పశుగణాభివృద్ధి చైర్మన్ మరియు భీమునిపట్నం జడ్పిటిసి గాడు వెంకటప్పడు నిత్య అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా గాడు వెంకటప్పడు మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమం నవంబర్ 28 వరకు 41 రోజులు అన్నదాన కార్యక్రమాన్ని గురు స్వామి ఆకెల్ల నర్సింమూర్తి స్వామి శిష్యుల ఆద్వర్యంలో జరుగుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ బోని బంగారు నాయుడు, సింగన్న బంధ గ్రామ సర్పంచ్ గాడు వెంకటనారాయణ, వైయస్సార్సీపి మండల అధ్యక్షులు గాడు శ్రీనువాసరావు, లక్ష్మీపురం నాయకులు గాడు తాత నాయుడు, యువనాయకులు నీలాపు సూర్యనారాయణ,సీనియర్ నాయకులు శ్రీ గుడాల ఎల్లయ్య , మద్దిల రామనాయుడు, భోగాపురం మండల తెలుగు దేశం పార్టీ నాయకులు రౌతు రామకృష్ణ, తాడితూరుసర్పంచ్ షిరిగీడి సంతోషి ఈశ్వరరావు , కేబుల్ వెంకట్రావు అయ్యప్ప పీఠం గురు స్వాములు కరుభుక్త ఈశ్వరరావు, షిరిగుడి చిన్న, గాడు సన్యాసి నాయుడు, తుపాకుల పైడిరాజు, సురాల సత్యనారాయణ, బోని ఈశ్వరరావు మరియు తదితర స్వామిలు, శివ భక్తులు పాల్గున్నారు..

