22న విశాఖలో " సింహ గర్జన " తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
విశాఖ వి న్యూస్ ప్రతినిధి:
విశాఖ గర్జన కాదు జగన్ జాగిలాలు " నిర్వహించే ర్యాలీఎక్కడ కష్టం ఉంటే అక్కడ చంద్రబాబు ఉంటారు జగన్ ప్రభుత్వం పై తెలుగు శక్తి దండయాత్ర విశాఖ గర్జన ర్యాలీకి నల్ల జెండాలతో నిరసన తెలపాలి మూడు రాజధానుల పేరుతో వైసిపి రాజకీయం సంపత్ వినాయక ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టిన బి.వి.ఆర్ తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
మూడు రాజధానుల అంశం పై ఈ నెల 22న విశాఖలో సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ తెలిపారు. శనివారం ఉదయం ఆశీల్ మెట్ట సంపత్ వినాయక ఆలయం వద్ద సింహ గర్జన కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. వంద కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు పేరిట రాజకీయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే ప్రతిపక్ష పార్టీల మీద దాడులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిశీలించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు చేయవలసిన పోరాటాలను అధికారంలో ఉన్న వైసీపీ నేతలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకే వైసీపీ నేతలు విశాఖ గర్జన పేరిట భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నారని విమర్శించారు. వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ప్రజలు తమ నిరసన తెలియ జేయాలని పిలుపునిచ్చారు.కాగా మూడు రాజధానుల ప్రజల మనోభావాలను వాస్తవంగా తెలుసుకొనే క్రమంలో 22వ తేదీన తెలుగు శక్తి ఆధ్వర్యంలో విశాఖలో భారీ ఎత్తున " సింహ గర్జన " సభ చేపడుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా వైసీపీ కార్యకర్తలు తన పై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. ఈ దాడిలో తన కారును అద్దం ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. అయినా తాను ఎవరికీ భయపడనని చెప్పారు. ఎట్టి పరిస్థితులలోను విశాఖలో "సింహ గర్జన" బహిరంగ సభను చేపడతానని వెల్లడించారు.ఎక్కడ కష్టం ఉంటే, ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు ఉంటే అక్కడ చంద్రబాబునాయుడు ఉంటారన్నారు. హుద్ హుద్ తుఫాను సమయంలో విశాఖలోనే వారం రోజులపాటు మకాం వేసి మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా ఎంతలా కృషి చేశారో "నీకు తెలియదా అమర్ " అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అంతలా కష్టపడుతుంటే ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారన్నారు. ఇప్పటికైనా ప్రజల అభీష్టం తెలుసుకొని తగిన నిర్ణయాలు తీసుకోవాలని హితువు పలికారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ సృష్టించే ప్రభంజనంలో 175 కి 175 శాసనసభ స్థానాలలోనూ అధికార వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు.