జనవాని కార్యక్రమం జయప్రదం చేయండి:పంచకర్ల సందీప్

 జనవాని కార్యక్రమం జయప్రదం చేయండి:పంచకర్ల సందీప్

మధురవాడ వి న్యూస్ ప్రతినిధి:

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సంబంధించి భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి పంచకర్ల సందీప్ ఎండడా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో సందీప్ మాట్లాడు తూ ఈనెల 15వ తారీకు నుండి 16వ  తారీకు వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన   ఉందని ఆయన 15వ తారీకు సాయంత్రం  ఐదు గంటల ప్రాంతం లో విశాఖపట్నం చేరుకుంటారని  16వ  తేదీన ఆయన జనవాని పేరిట పేదవారు అర్హులైన వారు వివిధ పథకాలకు అర్హులే ఉండి వేరు వేరు కారణాలవల్ల పథకాలు పొందలేకపోయిన వారికి జనవాని  కార్యక్రమం పేరిట వారి వద్ద దరఖాస్తులు తీసుకొని వాటికోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి  వారికి  ఆ పథకాలు లభించే విధంగా ఈ జనవాని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 

అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి మూడు రాజధానుల పేరుట విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి జరుగు తుందని వైకాపా నాయకులు  చేస్తున్న ప్రచారం అలాగే ఈ రాజధాని ఏర్పాటు చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టం లేదని అందుకే 15వ తారీఖున  మహాగర్జన ఉండటం వలన అది   విఫలం చేయడానికి జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం వస్తున్నారని వైకాపా నాయకులు చేసిన ప్రచారాన్ని  సందీప్ దుయ్యబట్టారు  మంత్రులు ధర్మాన ప్రసాదరావు బొత్ససత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ మొదలగువారు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానాలని అభివృద్ధి గురించి గానీ ప్రజా సమస్యల పై మాత్రమే మాట్లాడాలని లేని పక్షంలో జనసేన వీర మహిళల ద్వారా చీర గాజులు గుట్టు పంపిస్తామని హెచ్చరిక చేసారు ఈ కార్యక్రమం లో బివి కృష్ణయ్య శాకరి శ్రీను బాబు,పోతిన అనురాధ,పోతిన తిరుమల్ రావు,పోతిన నానాజీ పోతిన ప్రమీల శంకర్ రెడ్డి  పిల్లా శ్రీను భీమిలి నియోజకవర్గం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.