ఏ అధికారంతో వార్డు సెక్రటరీలు సబ్ రిజిస్టర్ కార్యకలాపాలు నిర్వహిస్తారు?

ఏ అధికారంతో వార్డు సెక్రటరీలు సబ్ రిజిస్టర్ కార్యకలాపాలు నిర్వహిస్తారు?

అమరావతి:

అమరావతి(Amaravathi): గ్రామస్థాయిలో వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ (Registration) అధికారాలు కల్పించడంపై హైకోర్టు (High Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామ ప్రసాద్ వ్యాజ్యం ధాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. పిటీషనర్ తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ (Shravan Kumar) వాదనలు వినిపించారు. రిజిస్ట్రేషన్ చట్టాలకి వ్యతిరేకంగా కేవలం వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పించడం చట్ట విరుద్దమన్నారు. గ్రామస్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారాలు తీసివేయటం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకమని జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.

దీంతో ఏ అధికారంతో వార్డు సెక్రటరీలు సబ్ రిజిస్టర్ కార్యకలాపాలు నిర్వహిస్తారని ప్రభుత్వ న్యాయవాదిని జస్టిస్ శేషసాయి, శ్రీనివాస్‌లతో కూడిన ధర్మసనం ప్రశ్నించింది. కేవలం వార్డు సెక్రటరీలకు మాత్రమే అధికారాలు కట్టబెడితే సబ్ రిజిస్ట్రార్ విధులు ఎలా నిర్వహిస్తారన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సంబంధించి అధికారాలు కొనసాగుతున్నాయా? లేవా? కోర్టుకు తెలిపాలంటూ ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ బుధవారానికి (19వ తేదీ) వాయిదా వేసింది.