జనసేనాని జనవాణి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

జనసేనాని జనవాణి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

మధురవాడ:

ప్రస్తుత పాలకవర్గ నాయకులు చేస్తున్న నూతన పాలసీలు వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని పోతిన తిరుమలరావు అన్నారు. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ జోన్ టు 7వ వార్డ్ జనసేన నాయకులు పోతిన.తిరుమల రావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన భాగంగా ఈ నెల 16 వ తేదీన ఆదివారం జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన జనవాణి కార్యక్రమం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో చేయడం జరుగుతుందని, ప్రస్తుత పాలకవర్గ నాయకులు చేస్తున్న నూతన పాలసీలు వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు సుదీర్ఘంగా చాలా సమస్యలతో బాధపడుతున్నారు వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళిన వారి సమస్యను పెడచెవునీ పెడుతున్నారు. గ్రామస్థాయిలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక బలం ఉన్న వ్యక్తులు, వలన పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని ఓదార్చే వారి సమస్యపై పరిష్కార మార్గంగా తీసుకెళ్లే నాయకులు చాలా అరుదుగా ఉన్నారు కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమార్గం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పవన్ కళ్యాణ్ గళం మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారని సమస్యల పైన ఈ యొక్క పాలక ప్రభుత్వాలు దృష్టి సారించాయి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని మీయొక్క సమస్యల్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లయితే వాటికి తప్పకుండా పరిష్కార మార్గం ఉంటుందని, కావున ప్రజలందరూ ఈ యొక్క జనవాణి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని జయప్రదం చేయవలసినదిగా 7వ వార్డ్ జనసేన నాయకులు పోతిన.తిరుమల రావు కోరడం జరిగింది.