గంటా శ్రీనివాసరావు కి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ శ్రేణులు
విశాఖ ఉత్తర :వి న్యూస్ ప్రతినిధి
విశాఖ పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన సనపల వరప్రసాద్, విశాఖ పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన వాసుపల్లి రాజు మరియు కార్యదర్శి గా నియమితులైన వైవివి ఆదినారాయణలు మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ని మర్యాద పూర్వకంగా కలిసి తమకు ఈ పదవి వచ్చుటకు కృషి చేసిన శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి చిక్కాల విజయ్ బాబు , రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, విశాఖ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడు జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్, జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా పార్టీ మహిళా కార్యదర్శి సౌజన్య, 54వ వార్డు ప్రెసిడెంట్ కుట్టా కార్తీక్, కార్యదర్శి శేఖర్, 25వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి రవి కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.