భారీ టార్గెట్‌ను ఛేదించిన ఆస్ట్రేలియా.

భారీ టార్గెట్‌ను ఛేదించిన ఆస్ట్రేలియా

మొహాలి:

మొహాలి: భారత్‌ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. హార్దిక్‌ పాండ్య(71 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌(55) అర్ధశతకాలతో చెలరేగారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఎలిస్‌ మూడు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టులో కామెరూన్‌ గ్రీన్‌(61) అర్ధశతకం చేయగా, వేడ్‌(45 నాటౌట్) స్టీవెన్‌ స్మిత్‌(35) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.