జోరు వానలో తడుస్తూ జనసైనికుని కుటుంబానికి భరోసా ఇచ్చిన డాక్టర్ సందీప్ పంచకర్ల

జోరు వానలో తడుస్తూ జనసైనికుని కుటుంబానికి భరోసా ఇచ్చిన డాక్టర్ సందీప్ పంచకర్ల.

పద్మనాభం:

ఆదివారం మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం, కృష్ణాపురం గ్రామంలో ఎలెక్ట్రిక్ షాక్ తగిలి మృతి చెందిన జన సైనికుడు పైడి నాయుడు కుటుంబాన్ని భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా సందీప్ పంచకర్ల మరియు పద్మనాభం మండల జనసేన పార్టీ నాయకులు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తరుపున మృతి చెందిన పైడి నాయుడు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని బరోసా కల్పించడం జరిగింది. తక్షణ సహాయం గా జనసేన పార్టీ నాయకుడు శివ కృష్ణ 5 వేల రూపాయల సహాయాన్ని ఇంఛార్జి డా. సందీప్ పంచకర్ల  చేతులు మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మనాభం మండల ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు.