విశాలాక్షి నగర్ లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు
తూర్పు నియోజకవర్గం :విశాఖ లోకల్ న్యూస్
9వ వార్డు విశాలాక్షి నగర్ పోలీస్ క్వాటర్స్ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు, ఓటర్ వెరిఫికేషన్, ఓటర్ నమోదు, ఓటర్ షిఫ్టింగ్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ ఎస్ సి సెల్ అధ్యక్షులు మరియు 9 వ వార్డు ఇంచార్జ్ బుడిమూరి గోవింద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నాకు ముఖ్య అతిధిగా తూర్పునియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు విచ్చేసి స్థానికులకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేయించి సభ్యత్వం కార్డులను అందజేశారు.
అలాగే ఓటు హక్కు లేనివారు ఖచ్చితంగా ఓటు ను నమోదు చేసుకోవలని ప్రభుత్వల తలరాతలు మార్చే ఆయుధం ఓటు రూపం లో ప్రీతి ఒక్కరి చేతిలో ఉన్నాదని ఈ ఓటు హక్కును వినియోగించుకోవటం మనందరి బాధ్యత అని ఈ సందర్బంగా ప్రజలకు తెలియజేసారు. అలాగేతెలుగుదేశం పార్టీ సభ్యత్వ తీసుకోవడం తో పాటు 200000/- రెండు లక్షల రూపాయిలు ప్రమాద భీమా వర్తిస్తుందని దురదృష్టవశతు ప్రమాదానికి గురి ఐతే నామిని కి రెండు లక్షల రూపాయిలు అందుతాయని ఈ సొమ్ము మన కుటుంబానికి ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి 9 వ నాయకులు వార్డు ప్రధాన కార్యదర్శి గెడ్డవలస వెంకటరావు, తూర్పునియోజకవర్గం ఐటీడీపి ఇంచార్జి బాదరు బాలరాజు, వార్డు ఉపాధ్యక్షులు చిన్నారావు, ఎస్ టి సెల్ అధ్యక్షులు రవి రామావత్,విశాఖ పార్లమెంట్ ఎస్ సి సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్ల ఈశ్వర్ రావు, పార్లమెంట్ ఎస్ సి సెల్ కార్యదర్శి బఠానా రాంబాబు, 9 వ వార్డు ఎస్ సెల్ అధ్యక్షులు పకీర్, శ్రీమన్నారాయణ, చంటి రాజు, పెద్ద,కావూరి శ్రీను మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..