తెలుగుదేశం పార్టీకి అయ్యన్న సేవలు మరువలేనివి..!*నారా లోకేష్ యువజన ఫౌండేషన్

తెలుగుదేశం పార్టీకి అయ్యన్న సేవలు మరువలేనివి..!*నారా లోకేష్ యువజన ఫౌండేషన్

 భీమిలి: విశాఖ లోకల్ న్యూస్

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఒకే పార్టీలో ఉంటూ విశిష్టమైన సేవలoదించిన మహోన్నత వ్యక్తి  చింతకాయల అయ్యన్న పాత్రడని  నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సభ్యులు అన్నారు.

మాజీ రాష్ట్రమంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు జన్మదినం సందర్బంగా నర్సీపట్నంలో ఉన్న ఆయన నివాసంకి వెళ్లి  నారా లోకేష్ యువజన ఫౌండేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు హర్ష రాజన్న, భీమిలి నియోజకవర్గం అధ్యక్షులు తుపాకుల సంతోష్ రాజా ఆధ్వర్యంలో పూలమాలలు, సాలువాలతో ఘనంగా సత్కరించారు.  ఈ సందర్బంగా అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను అభినందించారు.  పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా పార్టీకి అండగా ఉంటూ,  కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలబడిన నాయకుడు అయ్యన్నపాత్రుడు అని అన్నారు.  చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా ఇలాంటి ఆనందకరమైన జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని లోకేష్ ఫౌండేషన్ సభ్యులు  శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ  కార్యక్రమంలో  భీమిలి నియోజకవర్గం అధికార ప్రతినిధి కొయ్య రమేష్ రెడ్డి, కార్యదర్శి కోరాడ రాంబాబు రవి చరణ్ తదితరులు పాల్గొన్నారు.