కెవిఆర్ క్యాటరింగ్స్,సౌజన్య స్వీట్స్ ఆండ్ బేకరీ ఆధ్వర్యంలో అన్న సమారాధన
మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
మధురవాడ శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక పంచమ రాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సౌజన్య స్వీట్స్ మరియు పార్టీ బాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రేవళ్లపాలెం రోడ్డులో భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారూ
కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కేవీఆర్ క్యాటరీంగ్ అధినేత గరే గురునాధ్ ముఖ్యఅతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 3000 మంది అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా హ్యాండ్స్ టుా హెల్ప్ చిన్ని వెంకట్ మాట్లాడుతూ కెవిఆర్ అధినేత గురునాథ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.రానున్న రోజుల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు వారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.
కార్యక్రమంలో హ్యాండ్స్2హెల్ప్ చిన్ని,పోతిన వెంకటేష్, సంజీవ్,నాగోతి రమేష్,దుక్క గణేష్,శతీష్ పార్టీ బాయిస్ సభ్యులు పాల్గొన్నారు.