దేశం గర్భించదగ్గ ఆదర్శమూర్తులు సర్వేపల్లి, మధర్ తెరీసా..!టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
భీమిలి; విశాఖ లోకల్ న్యూస్
భారతదేశ ఔనత్యాన్ని నలుమూలలా వ్యాపింప చేసిన ఆదర్శ మూర్తులు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ మరియు మధర్ తెరీసా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు వ్యాక్యానించారు.
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి, మధర్ తెరీసా వర్ధంతి సందర్బంగా తెలుగుదేశం పార్టీ భీమిలి జోన్ 3వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్బంగా గంటా నూకరాజు మాట్లాడుతూ ముందుగా ప్రతీ గురువుకు ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పారు. గౌరవ ప్రధమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంచెలంచెలుగా ఎదిగి దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని చేపట్టి ఉపాధ్యాయ వృత్తికే ఎంతో గౌరవం తెచ్చారని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన సేవలకు గాను భారతరత్న బిరుదు కూడా ఇచ్చి ఈ దేశం గౌరవించిందని అన్నారు. అందుకే యావత్ దేశమంతా సర్వేపల్లి రాధాక్రిష్ణ జయంతి అయిన సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయుల దినోత్సవంగా చేస్తారని గంటా నూకరాజు అన్నారు.
అదేవిధంగా మధర్ తెరీసా ఈ దేశానికి చేసిన సేవ ప్రతీ భారతీయుడి హృదయాన్ని తాకేవిధంగా ఉంటుందని అన్నారు. మధర్ తెరీసా జీవితం ఈ దేశానికి త్యాగం చేసిన త్యాగమూర్తి అని గంటా నూకరాజు అన్నారు. ఎక్కడో యుగేస్లావియాలో పుట్టిన మధర్ తెరీసా భారతదేశం పౌరసత్వం తీసుకొని విశిష్టమైన సేవలoదించారని అన్నారు. కలకత్తా నగరంలో మురికివాడలో అట్టడుగున ఉన్న పౌరులకు ఎన్నో రకాలుగా సేవలదించారని చెప్పారు. అందుకుగాను మధర్ తెరీసా కు ఈ దేశం ఎన్నో బిరుదులతో సత్కరించిందని గంటా నూకరాజు అన్నారు. సర్వేపల్లి, మధర్ జీవితం మనకెంతో ఆదర్శమని గంటా నూకరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరపు నాగరాజు, పెంటపల్లి యోగీశ్వరావు, మారోజు సంజీవకుమార్, కనకల అప్పలనాయుడు, సంకురుబుక్త జోగారావు, వాడమొదలు సత్యారావు, కొక్కిరి అప్పన్న, పిల్లా తాతారావు, అప్పికొండ నూకరాజు, కె. ఎస్. ఆర్. కృష్ణారావు, జలగడుగుల మురళి, అర్ధపాకల గురునాధ్, వియ్యపు పోతురాజు, పైడిపల్లి నర్సింగరావు, మట్టా కొండ, కందుల సుందర్ రావు, వాసుపల్లి వంశీ, వాడమొదలు రాంబాబు, లక్ష్మణరావు, దాసరి రామారావు తదితరులు పాల్గొన్నారు.


