35 వేల రూపాయలు విరాళం అందించిన యువ నాయకుడు నవీన్ జ్ఞానేశ్వర్
ఆనందపురం సెప్టెంబర్ 5: విశాఖ లోకల్ న్యూస్ )
వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని వేములవలస ఎస్సీ కాలనీలో స్థానిక ఉపసర్పంచ్ నవీన్ జ్ఞానేశ్వర్ రావు తన తండ్రి మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కోరాడ నాగభూషణరావు ఆదేశాల మేరకు ఎస్సీ కాలనీలో వినాయక ఉత్సవాలకు 35 వేల రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. దేవుడు సేవతోపాటు ప్రజాసేవలో తనదైన దాతృత్వాన్ని చాటుకున్నారు ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ రావు.
ఈ కార్యక్రమంలో ఎల్.రాజు ఆర్.నారాయణరావు, యు.జీవన్, యు.శంకర్ యు శివ గ్రామస్తులు పాల్గొన్నారు.

