శ్రీ శ్రీ వినాయక చవితి మహోత్సవాల్లో ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు.
వికలాంగుల కోలని:
జీవీఎంసీ జోన్ టు 5వ వార్డ్ లో శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం కమిటీ అధ్యక్షులు పి.వి రమణ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా డ్రైవర్స్ కొలని, మరియు కార్పెంటర్స్ కాలనీ అలాగే ,వికలాంగుల కోలనిలో గల గురువు జయశ్రీ చిన్నారి ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ నృత్యాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పాల్గొని మాట్లాడుతూ అంతరించిపోతున్న సాంస్కృతిక కార్యక్రమాలు మళ్లీ ఈ కాలనీలో చిన్నారులతో చేయించడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా సంస్కృతిక కార్యక్రమాలు మరిచిపోకుండా ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిల్లలను ప్రోత్సాహించాలని కోరారు.ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈగల రవి, షిరిడి సాయి ధ్యానమందిరం సంఘమ్ సభ్యులు పిల్లల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.