ఘనంగా ప్రపంచ తైక్వాండో దినోత్సవ వేడుక

యుద్దకలల లో తైక్వాండో కు ప్రత్యేక గుర్తింపు: మార్షల్ ఆర్ట్స్ ఆనందరావు

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

ప్రపంచ తైక్వాండో దినోత్సవ వేడుక మధురవాడ శిల్పారామ ఆవరణలో ఆదివారం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆమె చూర్ టైక్వాండో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బసనబోయిన ఆనందరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో ముందుగా కేక్ కట్ చేసి క్రీడాకారులందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ (యుద్దకలల)లో తైక్వాండో కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాలలో ప్రత్యేక స్థానం సంపాదించిన కొరియన్ మార్షల్ ఆర్ట్స్ టైక్వాండో అని చెప్పారు .ఈ కార్యక్రమంలో ఇటీవల జరిగిన జాతీయ, రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలలో విశాఖ జిల్లా నుంచి పాల్గొని రాణించిన క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు.