స్టార్ పినకిల్ హెచ్ సి జి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరము

 స్టార్ పినకిల్ హెచ్ సి జి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్  వైద్య శిబిరము 

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

జీవీఎంసీ జోన్ టు 5వ వార్డ్  మరికావలస లో స్టార్ పినకిల్ హెచ్ సి జి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్  వైద్య శిబిరము  మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు మరియు వైసీపీ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉచిత వైద్య  శిబిరంలో డాక్టర్ బోర .మురళీధర్ పరవేక్షంలో క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తూ ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రజలకు ఉచిత మందులు అలాగే ఉచితంగా టెస్టులు చేయడం జరిగింది. అలాగే గుండె సంబంధిత బాధతో బాధపడుతున్న చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే స్టార్ట్ హెచ్ సి జి ఆధ్వర్యంలో వారికి ఉచితంగా కూడా వైద్యం కలిగిస్తామని డాక్టర్లు తెలియజేయడం జరిగింది. 


ఈ కార్యక్రమంలో మరికావలస వైసీపీ నాయకులు 5వ వార్డ్ వైసీపీ ఇంచార్జి పోతిన. సురేష్ కుమార్ , మార్కెట్ కమిటీ సభ్యులు జ్.ఎస్ రెడ్డి,వార్డ్ ప్రచార కార్యదర్శి రిషికేశ్,వారణాసి. శ్రీను,ఎమ్.రామారావు, శంకర్ రావు,, దాసరి కృష్ణ, నరసింగరావు, మోహనరావు, , మహిళలు చేకూరి. రజిని,గాయత్రీ,అప్పయ్యమ్మ మరియు.స్టార్ పినకిల్ వైద్య నిపుణులు పాల్గొన్నారు..