గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు భారీ అన్న సంతర్పణ
ఉత్తర నియోజకవర్గం:విశాఖ లోకల్ న్యూస్
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు నరసింహ నగర్ లో శ్రీ శ్రీ శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత, 51వ వార్డు తెలుగు యువత నరసింహ చౌదరి, 51వ వార్డు కార్యదర్శి మధు, బి సి సెల్ పేర్రాజు, వార్డు మహిళా అధ్యక్షురాలు ధవళ విజయ కుమారి మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు భక్తులు భారీగా పాల్గొన్నారు.