రోగులకు పోషక విలువలతో కూడిన పండ్లు, రొట్టె, బిస్కట్లు పంపిణీ
భీమిలి: వి న్యూస్ ప్రతినిధి
ఆనందపురం మండలం వేములవలస పంచాయితీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్జ్ఞానేశ్వర్ జన్మదినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి తన ఆత్మీయతను పంచుకున్నారు. అనంతరం భీమిలి వెళ్లి అక్కడ గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలు, రోగులకు పోషక విలువలతో కూడిన పండ్లు, రొట్టె, బిస్కట్లు అందజేశారు.
ఈ కార్యక్రమం స్థానిక వైద్యాధికారిణి సిహెచ్. కనకదుర్గ పర్యవేక్షణలో జరగగా స్టాఫ్ నర్స్ సిహెచ్. రాజేశ్వరి సిబ్బంది తమ వంతు సహాయం అందజేశారు. కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ వెంట బోధ నారాయణప్పడు, నడిమింటి అప్పలరాజు, కోరాడ మహేష్ , తాడ్డి జగదీష్ , వడ్ల బాలు మహేంద్ర, కుప్ప శ్రీను, పతివాడ సాయి ఉన్నారు.

