వాంబేకొలని అంగన్వాడి సెంటర్ లో పోషక అభియాన్ & మాతృ వందన్
మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ మరియు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిషోర్ పిలుపు మేరకు ప్రభాస్ యోజనలో భాగంగా మంగళవారం పోషక అభియాన్ మరియు మాతృ వందన కార్యక్రమం 7వ వార్డ్ మధురవాడ వాంబే కాలనీలో అంగన్వాడి సెంటర్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ మహిళా మోర్చా కార్యదర్శి పద్మజ మీనన్ మరియు రాష్ట్ర మహిళా మోర్చా ఇన్చార్జ్ శ్రీమతి నళిని దేవి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మహిళా మోర్చా ఇన్చార్జి దిలీప్ వర్మ విశాఖ పార్లమెంటరీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత పలువురు విచ్చేసి అంగన్వాడికి కేంద్రం నుంచి వచ్చిన పథకాలు మరియు కేంద్రం నుంచి 75% నిధులు మంజూరు అవుతున్న మహిళలకు గర్భిణీ స్త్రీలకు మాతృ వందనం సంబంధించి పోషకలు చేరుతున్నాయ లేదా వారిని అడిగి తెలుసుకొని వాళ్ల సమస్యలు కూడా అడగడం జరిగింది. ఈసందర్భంగా అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు ఫ్యాన్లు లేవని తెలిపారు. వెంటనే స్పందించిన మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత రెండు ఫ్యాన్లు అంగన్వాడీ సిబ్బందికి ఇవ్వడం జరిగింది.


