అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ సభ్యులు

 అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ సభ్యులు

తూర్పునియోజకవర్గం:విశాఖ లోకల్ న్యూస్ 

తూర్పు నియోజకవర్గంలో జీవీఎంసీ  9 వ వార్డు విశాలాక్షినగర్ సంజీవ్ నగర్ వద్ద వినాయకచవితి మహోత్సవాలలో భాగంగా వినాయకుని పందిరి వద్ద మహా అన్నసంతర్పణ కార్యక్రమం ఎస్. సి  కాలనీ అధ్యక్షులు నల్ల ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగినది.

ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా వచ్చినా తూర్పునియోజకవర్గం శాసనసభ్యులు  వెలగపూడి రామకృష్ణ బాబు మరియు విశాఖ పార్లమెంట్ ఎస్ సి సెల్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ 9 వ వార్డు ఇంచార్జి బుడిమూరి గోవింద్ విచ్చేసి విగ్నేశ్వర స్వామి వారి ప్రేత్యేక పూజలో పాల్గొని అనంతరం భక్తులకు స్వామి వారి అన్న ప్రసాదాన్ని సుమారు 2000 మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు..ఈ కార్యక్రమం లో తూర్పునియోజకవర్గం  ఐటీడీపి ఇంచార్జి బాదరు బాలరాజు, బఠానా రాంబాబు, పెద్ద,చంటి రాజు, మరియు గ్రామస్తులు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.