జాతీయ నులి పురుగుల దినోత్సవం లో : కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్
భీమిలి :విశాఖ లోకల్ న్యూస్
ఆనందపురం మండలంలోని వేములవలస ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులి పురుగుల దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని స్థానిక ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణకు దోహదపడే మాత్రలను వేసి మింగించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కే. స్వర్ణలత, సుభాషిని, ఎం ఎల్ హెచ్ పి కళావతి, ఏఎన్ఎం ఉమా తదితరులు పాల్గొన్నారు.

