జె .వి శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో భారీ అన్నదానం

 జె.వి. శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో భారీ అన్నదానం

మధురవాడ; విశాఖ లోకల్ న్యూస్

దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతులేదు, అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును.

అటువంటి అన్న సమారాధన కార్యక్రమం ఆదివారం మధురవాడ   శ్రీ సిద్ధి వినాయక శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ బాలాజీ హిల్స్, మిధిలాపురి, వుడా కోలనీ,  ఆలయ కమిటి ఆధ్యంలో   వరసిద్ధి వినాయక మహోత్సవ సందర్భంగా  జె .వి శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు దంపతులు వెంకటేశ్వర గుడికి 1,60,000 రంగులు వేయడానికి 1,30,000 హోమం శాలికి  మొత్తం 2,90,000 (రెండు లక్షల తొంబై వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్

సోమయాజుల సాయిలీల , కార్యదర్శి మగ్గురి వెంకట్రావు, విల్లు చక్రధర్ రావు, గరిమెళ్ళ నాగేశ్వరరావు,సుష్మ,  సుభాష్ , శ్యామ్ ,మరియు భక్తులు పాల్గొన్నారు