టీ విత్ రాష్ట్ర కళింగ వైశ్య & బేరివైశ్యా బిసి కార్పొరేషన్
చైర్మన్ అందవరపు.సూరిబాబు
విశాఖ లోకల్ న్యూస్:
విశాఖ జిల్లా దొండపర్తి లో సర్వేశ్వర్ రెడ్డి ఏర్పాటు చేసిన 102 అడుగుల ఎత్తు కలిగిన భారీ వినాయకుని దర్శనం చేసుకొని ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాధునికే చేస్తారు. స్వామి అనుగ్రహాం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాాయక చవితి పండుగను కుల మతా, జాతలకు అతీతంగానూ జరుపుకోవడం మరో విశేషం అన్ని రాష్ట్ర కళింగ వైశ్య & బేరివైశ్యా కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు అన్నారు...
తదుపరి ...కళింగ వైశ్య మరియు బేరివైశ్యా కులస్తుల సమస్యలు తెలుసుకోవడానికి బీసీ చైర్మన్ అందవరపు. సూరిబాబు విశాఖపట్నం సాగర్ నగర్ లో పొట్నూరు బాబూరావు స్వగృహములో సుమారు 20 కుటుంబాలకు చెందిన సభ్యులతో టీ విత్ చైర్మెన్ అనే కార్యక్రమం నిర్వహిస్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని వారితో స్నేహపూర్వకంగా కలిసి టీ తాగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాలు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సాగర్ నగర్ సంఘ సబ్యులు మల్లా వెంకటరమణ సతీమణి చక్కెర వ్యాధి తో బాధపడుతున్న ఆమెను పరామర్శించి ఆమెకు జరిగిన ఆపరేషన్ గురించి తెలుసుకొని ఆమెను ఓదార్చారు . అలాగే గుడ్ల యోగేష్ కుమారుడు లోకేష్ ఈ మద్య కాలములో జరిగిన బైక్ యాక్సిడెంట్ లో కాలు విరిగింది అని తెలుసుకొని వారిని కూడా పరామర్శించి చైర్మన్ సూరిబాబు తన సొంత వేతనంలో కొంత నగదు ని మరియు సాగర్ నగర్ సభ్యులు సహకారంతో ఇద్దరికీ నగదును ధన సహాయము చేశారు. కళింగ వైశ్య & బేరివైశ్యా కులస్తులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని రాష్ట్ర కళింగ వైశ్య & బేరివైశ్యా బిసి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు.సూరిబాబు తెలిపారు..ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సకలాబక్తుల ప్రసాదరావు,పొట్నూరు మదు సూదనరావు సంతోష్ కుమార్, నారాయణశెట్టి, శ్రీరామ్ మూర్తి అల్లిపురము సంఘం అధ్యక్షులు ఊన్న మోహనరావు పొట్నూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు


