వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరంలో ప్రారంభమయిన దసరా నవరాత్రి ఉత్సవాలు

  వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరంలో ప్రారంభమయిన దసరా నవరాత్రి ఉత్సవాలు

విశాఖ :వి న్యూస్ ప్రతినిధి..

విశాఖ  చెన్నారావుపేట లో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి  మందిరంలో ఘనంగా దేవీ నవరాత్రులు విశ్వబ్రాహ్మణుల మరియు స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ దేవీ నవరాత్రులకు ప్రత్యేక పూజలు నిర్వహించడానికి 38 వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి  నరసింహ చారి దంపతులు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి భక్తులు  కమిటీ వారు పాల్గొన్నారు..