ముందస్తు అరెస్టయిన విద్యార్ది నాయకుడు లెంక :
భీమిలి:విశాఖ లోకల్ న్యూస్ 2022 సెప్టెంబర్ 15
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో చెప్పిన 2లక్షల 40వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన టిఎన్ఎస్ఎఫ్ మరియు తెలుగు యువత నాయకులను పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ముందస్తు అరెస్టులు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రాంబాబు పురుషోత్తపురం లోని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోటిబాని శ్రీను యాదవ్ ను, దువ్వుపాలెం లోని తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ ను ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వీళ్ళు మాట్లాడుతూ ఏ తప్పు చేయకుండా అరెస్టులు చేయటాన్ని ప్రజలు అంతా గమనిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి కి విద్యార్థి, యువత పై చిత్తశుద్ది ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, వైసీపీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
