అంతర్జాతీయ బలవన్మరణం నివారణ దినం

అంతర్జాతీయ బలవన్మరణం నివారణ దినం.

విశాఖపట్నం:

అంతర్జాతీయ బలవన్మరణం నివారణ దినం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నగరంలో బీచ్ రోడ్ నందు కాళీమాత ఆలయం వద్ద ఉదయం ర్యాలీ నిర్వహించారు దీనికి ముఖ్య అతిధిగా నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్ శ్రీకాంత్, ఐ.పి.ఎస్., గారు, డి.సి.పి(ఎల్ &ఓ )  సుమిత్ సునీల్ గరుడ్, ఐ.పి.ఎస్., డి.సి.పి(క్రైమ్స్)  జి. నాగన్న ఇతర పోలీసు ఉన్నతాధికారులు, మానసిక వైద్య నిపుణులు డా. బాగ్యా రావు  మరియు ఆంధ్రప్రదేశ్ ఇండియన్ సైక్రియాట్రిక్ సొసైటీ శాఖ నుండి అధికారులు, వైద్య సిబ్బంది హాజరయినారు.     

  ఈ సందర్బంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ  ఈ అంతర్జాతీయ బలవన్మరణం నివారణ దినోత్సవంలో పోలీసు శాఖ భాగం కావడం చాలా ఆనందం కలిగించిందని, ప్రభుత్వం సమాజం లోని బలవన్మరణంలను తగ్గించాలనే కృత నిశ్చయంతో ఉండడం వలన ఈ దిశగా వైద్య మరియు పోలీసు శాఖలు అడుగులు వేస్తున్నాయని,ఆత్మహత్య ఒక్కరితో పోయేది కాదని అది కుటుంబంతో పాటూ కావాల్సిన వ్యక్తులకు ఎంతో శోకం కలిగిస్తుందని,ఈ విషయాన్నీ గుర్తించి ఎవరైతే మన చుట్టు ప్రక్కల నిరాశ, తీవ్ర ఒత్తిడిలో ఉన్నారో వారిని గుర్తించి సకాలంలో చర్యలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆత్మహత్యలు నివారించిన వాళ్ళమవుతాము అలాగే వారి జీవితాన్ని మరియు వారి కుటుంబాన్ని కూడా కాపాడినవాళ్లమవుతాం అని తెలియజేసారు.

             నిరాశ, ఆత్మనూన్యత ఇతర మానసిక ఒత్తిడితో బాధ పడుతుంటే డాక్టరును సంప్రదించాలని, ఈ విషయంలో సోషల్ స్టిగ్మా ను విడనాడాలని, మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలని, ఆధునిక సమాజంలో వైద్య సదుపాయాలను వినియోగించుకోవడానికి సంసయించరాదని తెలిపారు.

విశాఖపట్నంలో గత రెండు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బలవన్మరణంలలో తగ్గుదల కనిపిస్తుంది ఇది కొంత ఆశాజనక విషయం అనీ, సమాజంలో మన బాధ్యత మనం తెలుసుకొంటూ వీటిని అరికట్టెందుకు చర్యలు తీసుకోవాలని, బలవన్మరణంలను నివారించటానికి పోలీసు శాఖ కృతనిశ్చయంతో ఉంది, ఎవరైనా నిరాశ నిస్పృహలలో ఉండి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే DAIL-100 కు తెలియజేస్తే తక్షణమే స్పందించి వారి ప్రయత్నాన్ని నివారించడానికి కృషి చేస్తామని, ఇటీవల కాలంలో నలుగురు వ్యక్తులు బీచ్ నందు బలవన్మరణంకు ప్రయత్నిస్తే వారి కుటుంబ సభ్యుల సహాయంతో వారిని కాపాడడం జరింగిందని, ఇటీవల కాలంలో బలవన్మరణంకు పాల్పడే ముందు వారి కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు మెసెజ్ చేయడం చూస్తున్నాము, అవి వచ్చిన వెంటనే పోలీసులకు తెలియజేస్తే వెంటనే కాపాడే అవకాశం ఉంటుందని తెలియజేసారు.

        ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో పోలీసు శాఖను భాగస్వామ్యం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ శాఖకు  కృతజ్ఞతలు తెలిపారు.