అస్తమించిన పౌర సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లువలస జగదీశ్వర రావు.
మధురవాడ :
పౌర సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లువలస జగదీశ్వర రావు శుక్రవారం తుది శ్వాస విడిచారు.షిపియార్డ్ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన తర్వాత పౌర సంక్షేమ సంఘంను ఏర్పాటు చేసి స్ధానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సామాజిక బాధ్యతతో నిత్యం పని చేస్తూ వైఎస్సార్సీపీ ప్రచార కార్యదర్శి గా తన దైన ముద్రను వేసుకొని అందరి మన్ననలను పొందారు.విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాగూడదని చేస్తున్న కార్యక్రమంలో తీవ్ర అస్వస్థతకు గురి అయి సుమారు ఆరు నెలల గా అనారోగ్యం తో బాదపడుతూ శుక్రవారం కాలం చెందారు.బ్రతికి ఉన్నంత కాలం సామాజిక సేవ చేస్తూ ప్రజా నాయకుడిగా,బహు ముఖ ప్రజ్ఞాశాలి గా పేరుగడించారు.మధురవాడలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నిరంతరం ప్రజా ప్రతినిధులను కోరే వారని ఇప్పటికైనా ఏర్పాటు చేయు దిశగా ప్రయత్నాలు చేయాలని పలువురు కోరారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని స్ధానిక నాయకులు పలువురు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

