వినాయక నవరాత్రి మహొత్సవలలో భాగంగా భారీ అన్న సమారధన

 వినాయక నవరాత్రి మహొత్సవలలో భాగంగా భారీ అన్న సమారధన ముఖ్యఅతిధులుగా పాల్గొన్న నక్క శ్రీధర్,అవంతి మహేష్

మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్

శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక  నవరాత్రుల్లో మహోత్సవ కార్యక్రమంలో భాగంగా  రేవళ్లపాలెం రోడ్డు పోలీస్ స్టేషన్ వద్ద భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు,శ్రీ జగధాబిరామ కనస్ట్రక్షన్స్ అధినేత నక్క శ్రీధర్,భీమిలి వైసిపి ఇంచార్జ్ అవంతి మహేష్ లు ముఖ్యఅతిధిలుగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

అనంతరం అన్నసంతర్పన,కె.వి.ఆర్ కెటరింగ్స్,యుాటర్న్ మెన్స్ వేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఆద్యాత్మికంగా ముందుగా సాగాలని తెలిపారు.సుమారు 3500 మందికి భోజనాలు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందనందించారు.

ఆద్యాత్మిక,సేవ కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎప్పుడూ వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్స్2హెల్ప్ చిన్ని,కె.వి.ఆర్ గురునాధ్, జి.జనర్ధన్,బి.మళ్లిఖర్జున్,పిళ్లా రాంబాబు,వాణపల్లి శ్రీను,కె.య.నాయుడు,ఆర్.నాయుడు,జి.జగదీష్,డి.గణేష్,కమీటి సభ్యులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.