అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత సూచన.
మధురవాడ :విశాఖ లోకల్ న్యూస్
గత రెండురోజులుగా విస్తారంగా పడుతున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత సూచించారు. శనివారం 5వ వార్డ్ పరిధిలోగల కొండవాలు ప్రాంతాల్లో పర్యటించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారిలో ధైర్యం నింపి అధికారులను అప్రమత్తం చేశారు,సాయిరాంకాలనీలో వర్షాల కారణంగా గోడ కూలిన ఘటన స్థలానికి,పరదేశిపాలెం, లో వర్షం వలన దెబ్బతిన్న కాలువ తదితర ప్రాంతాలను కార్పొరేటర్ తో పాటు జీవీఎంసీ.ఏ.ఈ.శ్రీనివాస్,వర్క్ ఇన్స్పెక్టర్ రాజు,సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పరిశీలించారు.త్వరితగతిన పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.5 వ వార్డ్ లో ఎక్కువగా కొండవాళ్లు ప్రాంతాల్లో ఉండటం వలన మెట్లు మార్గాలు,రోడ్లు వర్షం వలన కృంగి ప్రమాదకరంగా
మారుతున్నయని స్థానికులు తెలియపరిచారు. ముఖ్యంగా శారద నగర్, సాయిరాం కాలనీ, సర్వేనెంబర్ 27 లో గల అన్ని ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువగా ఉండటం వలన ఈ సమస్యలను పై కౌన్సిల్ ద్వారా అధికారులకు తెలియపరచి త్వరలోనే సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తానని కార్పొరేటర్ హేమలత హామీ ఇచ్చారు.

