మధురవాడ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి

 మధురవాడ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

జీవీఎంసీ జోన్ టు  ఏడో వార్డులో ఉన్న మధురవాడ  రజక సంఘం  ఆధ్వర్యంలో మోగధరమ్మ కొలనిలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. 

ఈసందర్భంగా మధురవాడ రజక సంఘం ప్రెసిడెంట్ నర్వ. చంటి మాట్లాడుతూ ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించింది. పాలకుర్తిలో ఐలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనాన్ని సిపిఎం పార్టీ వారు ప్రజల విరాళాలతో నిర్మాణం చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 2015 సెప్టెంబరు 10న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందకారత్ ఆవిష్కరించారు.అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వైస్ ప్రెసిడెంట్ చందు మరియు మధురవాడ రజక సంఘ సభ్యులు   అప్పారావు సింహాచలం   కుమార్  చందర్రావు తదితరులు రజక నాయకులందరూ పాల్గొన్నారు.