బ్రేకింగ్::గాజువాక లో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహానికి పొంచి ఉన్న ముప్పు
గాజువాక:
విగ్రహం కూలిపోతుందేమో ఆన్న ఆందోళనలో పోలీసులు
తనిఖీ చేయాలని అర్ అండ్ బి అధికారులను కోరిన పోలీసులు
తనిఖీ చేసి ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయని నివేదిక ఇచ్చిన అర్ అండ్ బి అధికారులు
వెంటనే నిమజ్జనం చేయాల్సిందిగా సూచిస్తున్న పోలీసులు
18 వ తేదీ నిమజ్జనం చేయాలని నిర్ణయించిన ఉత్సవకమిటీ
ముందస్తు నిమజ్జనానికి అంగీకరించని కమిటీ
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తైన 89 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ
రోజూ వేలాదిమంది దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నట్టు ఆందోళన లో పోలీసులు
ఇప్పటికే ఎడమ వైపుకు ఒక అడుగు మేర వరిగిపోయిన 89 అడుగుల విగ్రహం
ఏ క్షణం అయినా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆందోళన
100 మీటర్ల లోపు ఎవ్వరినీ అనుమతించ వద్దని తాజాగా హెచ్చరించిన పోలీసులు


