స్మార్ట్ యోజన ఎంప్లాయిస్ కి త్వరగా న్యాయం చేయాలి.- AITUC రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ
విశాఖపట్నం:
సిఐడి విచారణ త్వరలో పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలి.
స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ (ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో దాదాపు మూడు నెలల నుండి స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ లో పనిచేసిన ఎంప్లాయిస్ కి న్యాయం జరగాలని ఉద్యోగాలు పేరిట వసూలు చేసిన లక్షలాది రూపాయలు తిరిగి వాళ్లకి చెల్లించాలని అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని. ఈ నేపథ్యంలో స్మార్ట్ యోజన హెల్ప్ లైన్ సొసైటీ రీజినల్ మేనేజర్ ని ఇందుపూడి సుధాకర్ ని ఈ నెల 8 వతేదీ నా అనకాపల్లి పోలీసులు అరెస్టు చేసి సిఐడి కి ఆ కేసుని అప్ప చెప్పడం జరిగింది అన్నారు. విశాఖపట్నం సిఐడి కార్యాలయం వద్దకు వేలాదిగా చేరిన బాధితులు ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ పాల్గొని మాట్లాడుతూ సిఐడి కార్యాలయం వద్దకు రాష్ట్ర వ్యాప్తంగా బాధితులందరిని రమ్మని వాళ్ల దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ తీసుకోవడం జరిగింది. సుమారుగా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మంది పైబడి నిరుద్యోగుల్ని మోసగించి కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగినటువంటి ఈ సంస్థ పై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సుమారుగా ఆరు జిల్లాల నుండి వందలాదిమంది బాధిత ఉద్యోగస్తులు సిఐడి కార్యాలయం వద్దకు చేరుకొని తమ దగ్గర ఉన్న ఆధారాలు సిఐడి అధికారుల వారికి సమర్పించడం జరిగిందని అన్నారు. ఈ ఉద్యోగస్తుల్ని మోసం చేసే దానిలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి, వైసిపి పార్టీల ప్రమేయం ఉందని ఆ యొక్క పార్టీల ఎమ్మెల్యే, ఎంపీలు,ఎమ్మెల్సీలు తమ లెటర్ హెడ్స్ ద్వారా రికమండేషన్ లెటర్లు పంపించి మరి ఉద్యోగస్తుల్ని జాయిన్ చేయించారని అన్నారు. కావున ఈ ఉద్యోగస్తులకు జరిగిన అన్యాయంకై వైసిపి ప్రభుత్వం, బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించి బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేనిపక్షంలో ఈ రికమండేషన్ లెటర్లు ఇచ్చి జాయిన్ చేయించినటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్లు ఇళ్లను కూడా ముట్టడిస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తక్షణమే సిఐడి విచారణ త్వరగా పూర్తిచేసి బాధితులు అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటియుసి.అల్లూరి.జిల్లా కో.కన్వీనర్. వి.అమర్ మాట్లాడుతూ 2018 నుండి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని నిరుద్యోగులకు ఆశ కల్పించి ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట 1,50,000 నుండి 750000 వరకు దోచుకోవడం జరిగిందని అన్నారు. అనేక జిల్లాల్లో పోలీస్ స్టేషన్లలో ఈ ఎన్జీవో సంస్థపై కేసుల నమోదు అయినప్పటికీ అధికార పార్టీ బలంతో బాధితులకు అండగా నిలిచిన ఏఐటియుసి మరియు జనసేన నాయకులను చంపేస్తామని మీ సంగతి తేలుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చిన్న చిన్న సెక్షన్స్ పెట్టి తప్పించే పద్ధతుల్లో వ్యవహారం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. గ్రీన్ ఇంక్ తో సంతకం పెట్టినటువంటి ఫోర్జిరీకి సంబంధించిన సెక్షన్ ఎటువంటివి వారిపై నమోదు కాలేదని అలానే బెదిరింపు చర్యలకు పాల్పడిన వ్యక్తులపై దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా ఎక్కడ నమోదు కాలేదని కేవలం 420 మాత్రమే పెట్టి విషయాన్ని నీరుగాచే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనిలో కేంద్ర మరియు రాష్ట్ర అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు సుమారుగా 1000 కి పైబడి రికమండేషన్ లెటర్ ఇచ్చి ఈ సంస్థ నందు ఉద్యోగాల కల్పనకు తోడ్పడ్డారని అన్నారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఇన్వాల్వ్ చేసుకొని ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది కనుక 2018 నుండి నేటి వరకు ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల స్కాం జరుగుతున్నప్పటికీ అధికారులు ఎవరూ దీన్ని పట్టించుకోకపోవడం అంటే కచ్చితంగా వారికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయని అర్థం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. కనుక సిఐడి కి అప్పజెప్పిన ఈ కేసును త్వరగా విచారణ పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. *జనసేన అనకాపల్లి నాయకులు దూలం.గోపి పాల్గొని మాట్లాడుతూ ఇందుపూడి సుధాకర్ కు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ స్పందించి వీరికి న్యాయం చేయకపోతే ఎవరైతే ఈ ఉద్యోగాలు కల్పనలో రాజకీయ నాయకులు ప్రమేయంతో రికమండేషన్ లెటర్ లో పెట్టి జయించేయించారో వాళ్లందరి పేర్లు బహిర్గతం చేస్తామని అన్నారు. ఈ ఉద్యమాన్ని ఇంతటితో విడిచి పెట్టేది లేకుండా భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఏవో అబ్దుల్ రజాక్, కాండ్రేగుల కిరణ్ కుమార్ తదితరులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

