5,6,7వార్డులలో ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
మధురవాడ:
భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 4 కోట్లతో 5,6,7, వార్డు లో మారికవలస, అమరావతి కొలని,పోతినమలయ్యపాలెం, స్వతంత్ర నగర్ ప్రాంతాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు విడదల రజని చేతుల మీదగా ఆరోగ్య కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ విశాఖపట్నం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ . మల్లికార్జున,జీవీఎంసీ విశాఖపట్నం కమిషనర్ లక్ష్మి షా 5 6 7 వార్డుల కార్పొరేటర్స్ మొల్లి హేమలత ముత్తంశెట్టి ప్రియాంక , పిల్ల మంగమ్మ మరియు 5వ ,6వ,7,వార్డు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, వివిధ కమిటీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సచివాలయం సిబ్బంది,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


