వృక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత్ మహాత్సవo.

వృక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత్ మహాత్సవo.

భీమునిపట్నం:

భీమునిపట్నం నియెజకవర్గం ఆనందపురం మండలంలో వృక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత్ మహాత్సవాలలో భాగంగా హర్ గర్ పే తిరంగా కార్యక్రమంలో వెల్లంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జాతీయ జెండాలతో విద్యార్థులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆనందపురం మండల అధ్యక్షురాలు డాక్టర్ మజ్జి శారద ప్రియాంక ముఖ్య అతిధిగా పొల్గున్నారు.ఆమె మాట్లాడుతూ భారత దేశం కి స్వాతంత్ర్య వచ్చి 75 సం పూర్తి అయిన సందర్భంగా ఎంతో మంది అమరవీరుల త్యాగానికి ప్రతీకగా మనం స్వాతంత్ర్య జరుపుకుంటున్నాం. భారతదేశం ఈ 75 ఏళ్ళు లో ఎంతో పురోగతి సాధించాం, ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయి, ప్రతీ భారతీయుడు కూడా దేశభక్తి తో ముందుకు సాగాలని   ఆజాద్ కా అమృత్ మహాత్సవాల బాగంగా హర్ గర్ పే తిరంగా కార్యక్రమం  ఇచ్చిన నేపద్యంలో ప్రత్యేకంగా ప్రతీ ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపు నిచ్చారు .

వృక్ష ఫౌండేషన్ అధ్యక్షులు కాకర సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆజాది కా అమృత్ మహోత్సవం లాంటి కార్యక్రమాలు జాతీయ భావాన్ని పెంపొందించే దిశగా దోహదపడుతాయన్నారు. ప్రపంచంలోనే ప్రత్యేక, సుస్థిర స్థానాన్ని సాధించుకున్న భారతదేశ సమగ్రత కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరసింహమూర్తి ,  క్రైమ్ ఎస్సై మన్మధరావు , ట్రాఫిక్ఎస్సై  , వెల్లంకి సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు, ఉప సర్పంచ్ కంచరాపు శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకట్రావు ,సీనియర్ నాయకులు కాకర వెంకటరమణ,  చంద్రమౌళి, మాస్టర్ బాబూలాల్ , పంచాయతీ కార్యదర్శి బాబి,మేము సైతం సొసైటీ దేవుడు బాబు ,శ్రీనివాసరావు, మాద బత్తుల బుజ్జి,బోద్ధపు బంగార్రాజు , వృక్ష ఫౌండేషన్ సభ్యులు సాడి శంకర్, చుక్క నాయుడు,కాకర కిరణ్, కొమ్ము ఉదయ్ తదితరులు నాయకులు పొల్గొన్నారు.