స్వాతంత్ర్య వేడుకలలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.

స్వాతంత్ర్య వేడుకలలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

ఆనందపురం :

స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వాతంత్ర్య వేడుకలకు సంకేతంగా ముందుగానే వివిధ కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థుల చేత జాతీయ జెండాలు పట్టుకుని ప్రజలను చైతన్యపరిచే విధంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ ని వేములవలస ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ప్రారంభించి మాట్లాడారు. జెండా పండుగ అంటేనే విద్యార్థుల పండగ   వారు లేనిదే ఈ జెండా పండగ కు నిండుతనం ఉండదని అభివర్ణించారు. విద్యార్థులలో దేశభక్తి పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దేశ సార్వభౌమత్వం, జాతి సమైక్యత పౌరుల్లో చాటిచెప్పాలని  కోరారు. అనంతరం కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తన సొంత నిధులు సమకూర్చి టెన్త్ క్లాస్ ఫలితాలు టాపర్లుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులను సన్మానించి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయుడు బి. శ్రీనివాసరావు,  ఇన్చార్జి హెచ్ఎం కె.రామకృష్ణ పట్నాయక్, పోరాం రవి ప్రసాద్, జి.శంకర్ రావు, మాలతి,  బంగారం తదితరులు పాల్గొన్నారు.