దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి, తల్లి రాజేశ్వరి పై ఎఫ్.ఐ.ఆర్.
ఎండాడ: విశాఖ లోకల్ న్యూస్
ఈ ఏడాది జూలై 24వ తేదీన సాగర్ నగర్ సమీపంలోని సాయి వింటేజ్ లో జరిగిన గొడవల నేపథ్యంలో దేవదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి కళింగిరి ఆమె తల్లి రాజేశ్వరి పై ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఎఫ్. ఐ.ఆర్ నమోదయింది. ఐపీసీ 34,323,448,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 8వ తేదీన ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి సాగర్ నగర్ లోని సాయి వింటేజ్ ఫ్లాట్ నెంబర్ 202లో శాంతి ఆమె తల్లి కుటుంబంతో పాటు నివాసముంటున్నారు. వారు మొక్కలు పెంచడంతో ఆ మొక్కలకు పోస్తున్న నీరు ఉన్న వారి దిగువున నివసిస్తున్న అశోక్,మీనాలకు చెందిన కారు పైన పడుతోంది. మరియు అపార్ట్మెంట్ లో కింద ఇంటి ఏసీపైనా పడుతోంది. దీంతో రెండు కుటుంబాల మధ్య జరిగిన మాటల వాగ్యుద్ధం నేపథ్యంలో శాంతి, మీనా పై చేయి చేసుకున్నారు. దీంతో మీనా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర విచారణ జరిపి శాంతి, ఆమె తల్లి రాజేశ్వరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.శాంతి ప్రస్తుతం విజయవాడ లో సహాయ కమీషనర్ గా పనిచేస్తున్నారు. ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

