అన్ని రంగాలలో దివ్యాంగులు ముందుండాలి : నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి
విశాఖపట్నం:
విశాఖపట్నం ఆగస్టు 13:- ప్రతి రంగంలో వివిధ ప్రతిభావంతులు ముందుండాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆంధ్ర ప్రదేశ్ పారా బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వివిధ ప్రతిభావంతులకు మెడల్స్ ను అందించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుండాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 13 జిల్లాల నుండి పారా బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొని ఎంతో ఓర్పుతో ఆడి వారి ప్రతిభను కనబర్చిన దివ్యాంగుల ను మేయర్ అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగుల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, నెలకు మూడు వేల రూపాయల పింఛన్, ఉద్యోగ కల్పనలో వారి రిజర్వేషన్ అమలు చేయడం, చదువుకునేందుకు రాయితీలు మొదలైనవే అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే మీరు కూడా మాలో ఒకరిగా అన్నిరంగాల్లో పోటీపడి ముందుండాలని సూచించారు. ఈ పోటీలు ఘనంగా నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ పారా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారిని మేయర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి పి. సంతోష్ ,మాజీ రిజిస్టర్ టి. వైరాగి రెడ్డి, బ్యాట్మెంటన్ కోచ్ సిహెచ్. చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ పారా బ్యాట్మెంటన్ సెక్రెటరీ వి. రామస్వామి తదితరులు పాల్గొన్నారు.


