మహానుభావులు చేసిన త్యాగాల ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవము:వేములవలస ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్
ఆనందపురం:
ఆనందపురం బ్రిటిష్ వారి చెర నుండి భారతీయులను విడిపించడానికి ఎంతో మంది మహానుభావులు చేసిన త్యాగాల ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవమని వేములవలస ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. స్థానిక పాఠశాలలో ఆయన విద్యా కమిటీ చైర్మన్ చందక లక్ష్మి తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భారతదేశం భారతీయ ప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. జన్మనిచ్చిన తల్లి దేశం ఒకటే అనే భావన కలిగి ఉండాలన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం స్వర్ణలత, కే సుభాషిని, అంగన్వాడీ టీచర్ నదియా, వడ్ల భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
