ఇదేనా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి ఇచ్చిన గౌరవం?
పోతినమ్మల్లయ్యపాలెం:
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతణమయ్యిందా?
75ఏళ్ళ స్వతంత్ర భారత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మర్చిపోయిన విశాఖపట్నం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పతనం అవ్వటంతో కాంగ్రెస్ నాయకులు లేక మధురవాడ, పోతినమ్మల్లయ్యపాలెం రహదారిలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం తల విరిగిపోయి చాలా కాలమైన ఎవరు పట్టించుకోకుండా మాజీ ప్రధాని పదవిలో ఉండగా దేశం కోసం హత్యకాబడిన ప్రధాని విగ్రహానికి ఇదేనా ఆయనికిచ్చిన గౌరవం అంటున్న ప్రజలు.పార్టీల కతీతంగా మాజీ ప్రధాని అన్న గౌరవం తో అయిన కనీసం అధికారులు మరమ్మత్తులు చెయ్యకపోవటం ఆశ్చర్యనికి గురుచేస్తుంది అంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మత్తులు చెయ్యాలని కోరుతున్నారు.

