ఆర్.ఎస్.ఎ.వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా75వ స్వాతంత్రదినోత్సవ వేడుక.!

ఆర్.ఎస్.ఎ.వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా75వ స్వాతంత్రదినోత్సవ వేడుక.!

మధురవాడ:

ఎందరో మహాత్ముల ప్రాణత్యాగఫలమే స్వాతంత్ర దినోత్సవం. 

జీవీఎంసీ జోన్-2 కమిషనర్ బొడ్డేపల్లి రాము.

ప్రతినిధి మధురవాడ: జీవీఎంసీ5,7 వార్డు పరిధి స్వతంత్రనగర్ లో ఆర్.ఎస్.ఎ.వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా75వ స్వాతంత్రదినోత్సవ వేడుక నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జీవీఎంసీ జోన్-2 కమిషనర్ బొడ్డేపల్లి రాము ముఖ్య అతిథిగా విచ్చేసి జండా ఆవిష్కరణ నిర్వహించారు. స్వతంత్ర సమరయోధుల ఆశయాలను ప్రజలందరూ గ్రహించి త్యాగమూర్తుల ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈసందర్భంగా.. అధ్యక్షులు పోలిమాటి సునీల్ కుమార్,కార్యదర్శి అధికారుల కాళిదాసు,చీఫ్ ప్యాట్రన్ వాసం సంతోష్ కుమార్(మాస్టర్ మణి)మాట్లాడుతూ ఎందరో మహాత్ముల ప్రాణత్యాగఫలం వలన దేశ ప్రజలంతా భారతావనిలో స్వేచ్ఛ జీవులుగా బతుకుతున్నామని గుర్తుచేశారు.స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనంఎన్నడూ మరువరాదని వారి ఆశయసాధనకు నేటి యువత మరింతముందుకు సాగి భారతదేశ ఖ్యాతిని మరింత ఇనుముడింపజేయాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటలపోటీల విజేతలకు బహుమతులు అందించారు.ఈకార్యక్రమంలో ఆర్.ఎస్.ఎ.గౌరవ అధ్యక్షులు జీలకర్ర గణేష్,సలహాదారులు పీ.ఎం.దయానంద్,అర్జీ కేశవ, ఉపాధ్యక్షులు ఉగ్గిననాగరాజు, డి.హరి,ఉప కోశాధికారి శశియాదవ్, కార్యవర్గ సభ్యులు మురళీ, విజయ్,ధర్మ,శివారెడ్డి,రొంగలి సంతోష్,సూరి,అలీ, సుబ్రమణ్యం,సంతోష్,రెడ్డి, మణికుట్టన్,కరకాని ఈశ్వరరావు,బాలుపాత్రో జర్నలిస్ట్ పాల్గొన్నారు.