హజరత్ ముఖ్తియార్ అలీ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఎం.డి అహ్మద్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్:
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హజరత్ ముఖ్తియార్ అలీ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఎం.డి అహ్మద్ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్థానిక వైఎస్‌ఆర్ కాలనీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి, సెల్యూట్ చేశారు. అనంతరం హజరత్ ముఖ్తియార్ అలీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, వృద్ధులకు చీరలు, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధి రోహించాలని కోరారు. స్వాతంత్య్రం మనకు వచ్చిందంటే ఎంతో మంది పోరాట యోధుల పోరాట ఫలితమే మనం స్వాతంత్య్రంగా అనుభవిస్తున్నామన్నారు. స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని పేర్కొన్నారు. జాతీయ జెండా మన స్వాతంత్రానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. సార్వ భౌమ త్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక. వాదాలు వేరైనా దేశ స్వాతంత్రం గమ్యంగా పోరాడారు ఆనాటి యోధులు. వాళ్లను స్మరించుకుంటూ.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా ఐదో వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టిన సందర్భాన, దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజును దేశ ప్రజలంతా కుల, మతాతలకు అతీతంగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపు కుంటున్నామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున హజరత్ ముఖ్తియార్ అలీ చారిటబుల్ ట్రస్టు తరుపున విద్యార్థులకు, వృద్ధులకు సేవా చేయడం హర్షణీయమని ట్రస్టు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, టీడీపీ ఐదవ వార్డు సెక్రటరీ ఈగల రవి, టీడీపీ సీనియర్ నాయకులు నమ్మి శ్రీను, కనకదుర్గ సప్లయర్స్ అధినేత కొర్రాయి సురేష్, ట్రస్టు సభ్యులు జలాల్‌భాష, ఫాజిల్ రెహ్మాన్, ఖాదర్, తాజ్, వినయ్, రాజు, కాలనీ వాసులు ఓలేటి శ్రావణ్, రవి తదితరులు పాల్గొన్నారు.

