ఎన్ హెచ్ ఆర్ సి కార్యాలయంలో 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
విశాఖ:
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పి సంపత్ కుమార్ ముఖ్యఅతిథిగా సభ అతిథిగా లీల హరిప్రసాద్ నేషనల్ లీగల్ సెక్రెటరీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ ముఖ్య కార్యదర్శి స్వప్న పాలక, చంద్రశేఖర్, చంద్రమౌళీధర్, శిరీష, సంతోష్, హర్ష, డాక్టర్ కుప్పిలి, నరేష్, హర్ష, ఓంకార్, మురళీమోహన్, శ్రీనివాస్, లీలా ప్రసాద్, మహేష్, అనుపమ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకోంటున్న సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను సుమారు 5 లక్షలకు పైన వీరమరణం పొందిన వారిని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించాలని అంజలి ఘటించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది.

